ఉడికించిన వేరుశనగల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలతో సహా శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యం బాగుండేందుకు సహకరిస్తాయి.
ఇందులో మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొవ్వులు. మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
ఉడికించిన పళ్లీల్లో రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు వంటి సమస్యలకు చెక్‌పెడుతుంది.
వేరుశనగల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీటిలో ఉండే అధిక ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ కడుపుకు సంతృప్తినిచ్చి, అధిక ఆకలిని అడ్డుకుంటాయి. దీంతో ఎక్కువగా తిని బరువు పెరగకుండా ఉంటారు.
ఉడికించిన వేరుశనగల్లో ఉండే ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యగా షుగర్‌తో ఇబ్బంది పడుతున్న వారికి ఉడకబెట్టిన పళ్లీలు మంచి ఆహారంగా పనికొస్తుంది.
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు ఉడికించిన వేరుశనగల్లో మెండుగా ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థకు సహాయపడి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి.
ఉడికించిన వేరుశనగలో డ్రైఫ్రూట్స్‌తో సమానమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వలన విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. అవయవాల ఎదుగుదలకు కావల్సిన బి కాంఫ్లెక్స్ విటమిన్లు లభ్యమవుతాయి.
ఉడకబెట్టిన పల్లీల్లో ఉండే పాలీఫినాల్స్ మన శరీరంలో కలిసిపోయి శరీరాన్ని ఆరోగ్యవంతంగా, చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. దానితోపాటు చర్మాన్ని డీహైడ్రేట్ కు గురికాకుండా తాజాగా ఉంచుతుంది.