17 September 2023
శరీరంలో బలం, రక్తం రెండింటినీ పెంచే కూరగాయల అనేకం ఉన్నాయి. ఇవాళ మనం వాటి గురించి తెలుసుకుందాం.
కూరగాయల్లో ఆరోగ్యకరమైన కూరగాయలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి బీట్‌రూట్. దీనిని తినడం వలన సిరల్లో రక్తం, శరీరానికి శక్తి అందుతుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో సహా వివిధ పోషకాలు అవసరం. ఇవన్నీ బీట్‌రూట్‌లో ఉంటుంది.
బీట్‌రూట్ శరీరంలో రక్తాన్ని పెంచడంతో పాటు రక్త ప్రసరణను కూడా నిర్వహిస్తుంది. దీనిని తినడం వలన శరీరానికి ఫైబర్, ఇతర పోషకాలు కూడా అందుతాయి.
బీట్‌రూట్‌లో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది మన కండరాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ఎర్రటి బీట్‌రూట్‌లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని ఆకులలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బీట్‌రూట్ తినడం వల్ల శరీరంలో బలం పెరుగుతుంది. మీరు దీన్ని సలాడ్‌గా కూడా తినవచ్చు. శరీరానికి ఇన్‌స్టాంట్ శక్తి లభిస్తుంది.