మనం తినే బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
బీరకాయ తినటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపడటం తో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడం లో కూడా సాయపడుతుంది.
బీరకాయ కేలరీలు తక్కువగా ఉంటుంది పీచుపదార్థం ఎక్కువగానూ ఉంటుంది. ఇది తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బీరకాయ తినటం వల్ల ఇందులోని పీచు రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది .
బీరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో జింక్, ఐరన్ ,పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
బీరకాయలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది ప్రేగుల్లో జరిగే కదలికలను సాఫీగా ఉంచటానికి ప్రయత్నిస్తుంది.
బీరకాయలో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉండేటందుకు సహాయపడతాయి.
బీరకాయను ఆహారంలో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి అకాల వృద్ధాప్య ఛాయలు నివారించడంలో సహాయపడుతుంది.