రోజుకి 4000 అడుగులు నడిచినా చాలు !! మరణాన్ని తప్పించుకోవచ్చట
11 AUGUST 2023
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే రోజుకు 10 వేల అడుగులు నడవాలనేది చాలా కాలంగా చెబుతున్నదే.
అయితే, కొత్త అధ్యయనం ప్రకారం 5 వేల అడుగుల కంటే తక్కువే నడిచినా ఒక గొప్ప ఆరోగ్య ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 2,26,000 మందిపై చేసిన ఒక విశ్లేషణలో రోజుకు 4,000 అడుగులు నడిస్తే..
ఏ కారణంగానైనా సంభవించే అకాల మరణం ముప్పును తగ్గించుకోవచ్చని తేలింది.
గుండెకు, రక్తనాళాలకు మేలు కలగడం కోసం రోజుకు 2,300 అడుగులు నడిస్తే సరిపోతుంది.
ఎంత ఎక్కువగా నడిస్తే, అంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెప్పారు.
నాలుగు వేలు దాటిన తర్వాత 20 వేల అడుగుల వరకు జోడించే ప్రతీ వెయ్యి అడుగులు అకాల మరణం ముప్పును 15 శాతం తగ్గించాయి.
నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా..
60 ఏళ్లలోపు వారిలో దీనివల్ల గొప్ప ఫలితాలు కనిపించాయి. ఆరోగ్యం కూడా బాగుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
వ్యాయామం సహా జీవనశైలిలో మార్పులపై దృష్టి పెట్టాలి. విశ్లేషణలో కూడా ఇదే మా ప్రధాన అంశం.
గుండె సంబంధిత ముప్పులను తగ్గించుకోవడానికి, జీవిత కాలాన్ని పెంచుకోవడానికి మెరుగైన జీవనశైలిని అనుసరించాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి