బీపీతో బాధపడేవారికి మందారం ఎంతో ఉపయోగపడుతుంది. మందారంతో టీ చేసుకొని తాగడం వల్ల బీపీ కంట్రోల్‌లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఈ టీ తాగితే బీపీ తగ్గుతుంది.
ఐరన్ లోపంతో బాధపడేవారికి కూడా మందార పువ్వు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మందారం మొగ్గలను గ్రైండ్ చేసి దాని రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వార మందారం పువ్వుతో చేసిన టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు తగ్గొచ్చు.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా మందారం పువ్వు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపుబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
వయసు పెరిగే కొద్దీ వచ్చే వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో మందారం ఉపయోగపడుతంది. ఇందులోని యాంటీ ఏజింగ్ కాంపోనెంట్స్ చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది.
మందారం ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో విటమినస్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గువంటి సమస్యలు దరిచేరకుండా కాపాడుతంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.