TV9 Telugu

11 May 2024

రోజూ ఒక గుడ్డు తినమనేది ఇందుకే.. 

ప్రతీ రోజూ ఒక కోడి గుడ్డు తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

గుడ్డులోని పచ్చ సొన తింటే లావుగా అవుతామని అనుకుంటారు. కానీ నిజానికి పచ్చ సొన శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

గుడ్డులో ఉండే మంచి కొవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. 

పిల్లలకు కచ్చితంగా ప్రతీ రోజూ ఒక గుడ్డు ఇవ్వాలని నిపుణులు సూచిస్తుంటారు. దీనికి కారణం కోడి గుడ్డు పిల్ల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

గర్భిణీలు కచ్చితంగా రోజుకో గుడ్డు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కోడి గుడ్డు తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా జన్మిస్తారు

గుడ్డు క్యాల్షియంకు పెట్టింది పేరు. దీంతో ప్రతీ రోజూ గుడ్డును తీసుకోవడం వల్ల జుట్ట, చర్మం, గోర్లు లాంటివి ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డులోని క్యాల్షియం ఎముకలు దృఢంగా మారడంలో ఉపయోగపడతాయి. ప్రతీ రోజూ ఒక కోడి గుడ్డు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే కీళ్ల సమస్యలు తగ్గుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.