వంటగదిలోని ఈ పదార్ధంతో గ్యాస్-గుండె జబ్బులకు చిటికెలో చెక్ పెట్టొచ్చు..!
19 August 2024
TV9 Telugu
TV9 Telugu
బేకింగ్ సోడా అంటే రసాయనికంగా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్. దీన్నే సోడియం బైకార్బొనేట్ అనీ అంటారు. దుస్తుల్ని శుభ్రం చేసే సోడియం కార్బొనేట్‌లోని కార్బాక్జిలిక్ ఆమ్ల అయానుకు ఒక హైడ్రోజన్ కలిస్తే ఏర్పడే పదార్థాన్ని సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అంటారు
TV9 Telugu
నీటిలో కరిగిన సోడియం కార్బొనేటుకి ఎక్కువ మోతాదులో కార్బన్‌డయాక్సైడును పంపడం ద్వారాగానీ, సోడియంహైడ్రాక్సైడు ద్రావణంలోకి కార్బన్‌డయాక్సైడును పంపడం ద్వారాగానీ సోడియం బైకార్బొనేట్ (బేకింగ్ సోడా)ను తయారు చేస్తారు
TV9 Telugu
ఇలా తయారు చేసిన బేకింగ్ సోడాను వివిధ వంటకాలలోఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా వేయించిన ఆహారాన్ని మరింత రుచిగా మారుస్తుంది
TV9 Telugu
కానీ వంటల్లో మాత్రమే కాదు. బేకింగ్ సోడాను అనేక ఇతర రోజువారీ పనులకు కూడా ఉపయోగిస్తారు. మొండి రంగులను తొలగించడానికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది
TV9 Telugu
ఇంకు నుంచి మొండి నూనె మరకల వరకు దేన్నైనా బేకింగ్ సోడా ఇట్టే శుభ్రం చేస్తుంది. కానీ బేకింగ్ సోడా ఆహారాన్ని మృదువుగా మార్చడానికే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని మీకు తెలుసా?
TV9 Telugu
అవును.. బేకింగ్ సోడాను నీటిలో కలిపి తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులు దూరం చేస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. బేకింగ్ సోడా ఎలాంటి సమస్యలకు దూరం చేస్తుందంటే..
TV9 Telugu
బేకింగ్ సోడా మిశ్రమం మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటును తగ్గించడంలోనూ బేకింగ్ సోడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు బేకింగ్ సోడా తినవచ్చన్నమాట
TV9 Telugu
2018లో జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురించిన డేటా ప్రకారం బేకింగ్ సోడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలోని కొన్ని పదార్థాలు గుండె జబ్బుల చికిత్సలో కూడా సహాయపడతాయి
TV9 Telugu
బేకింగ్ సోడా డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని హెన్షెల్ గ్యాస్ హార్ట్ బర్న్ సమస్యను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది