ఫూల్‌ మఖానా పోషకాల ఖజానా! రోజూ గుప్పెడు తింటే చాలు..

Jyothi Gadda

26 September 2024

తామర గింజలు సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లో ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్‌ కంటే  ఏ మాత్రం తక్కువ కాదు. 

ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. 

నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. 

లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్‌లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి.

మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది.

తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలు. ఇందులో ఫైబర్  పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. 

తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది.

అలాగే  ఇతర  దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. తేలికగా బరువు తగ్గాలనుకునే వారు  లోటస్‌ సీడ్స్‌ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.