నిత్యం మరుగుతూ .. పొగలు కక్కే నదిని ఎప్పుడైనా చూశారా?
26 December 2023
TV9 Telugu
ప్రకృతి నిజంగా చాలా గొప్ప అద్భుతాలను పరిచయం చేస్తుంది. అవి నిజంగా ఎలా ఏర్పడ్డాయన్నది ఓ మిస్టరీగా మిలిగిపోతుంది.
పొగలు కక్కే నది దక్షిణ అమెరికాలోని పెరువియన్ అమెజన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఉంది. ఇది అమెజాన నదికి ఉపనిదిగా కూడా పిలుస్తారు.
ప్రపంచంలోనే మరుగుతున్న ఈ నది షానయ్-టింపిష్కా అనే పేరుతో పిలుస్తుంటారు. నిజానికి ఇది లా బొంబా నదిగానే బాగా ప్రసిద్ధి.
సుమారు 6.4 కిలోమీటర్లు పొడవైన నది. ఈ నది నీటి ఉష్ణోగ్రతలు 212 డిగ్రీల ఫారెన్‌హీట్ అంటే 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
ఆ ప్రదేశంలో ఉండే రాతినేలల్లో విపరీతమైన వేడి ఉండటం కారణంగానే ప్రవహించే ఈ నది మరుగుతుందంటున్నారు నిపుణులు.
ఈ నది ఇలా ఎందుకు ఉందిని.. దీనికి గల కారణం గురించి ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్తలు కూడా బయటపెట్టలేకపోయారు.
స్థానికులు షానయ్-టింపిష్కా నది జలాలు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని, ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయని విశ్వస్తారు.
పర్యావరణ ప్రేమికులు ఈ సహజ సిద్ధ ప్రకృతి అద్భుతాల వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తుంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి