TV9 Telugu

కాళ్ళతో నడిచే చేపను ఎప్పుడైనా చూశారా..?

04 March 2024

సముద్రంలో నిత్యం కొత్త జీవులు ఆవిష్కృతమవుతున్నాయి. శాస్త్రవేత్తలు 100 కంటే ఎక్కువ కొత్త జాతులను కనుగొన్నారు.

ఇటీవల 'నడక' చేపను కనుగొన్నారు. చిలీ తీరంలో లోతైన సముద్రంలో 100 కంటే ఎక్కువ కొత్త చేప జాతులను కనుగొన్నరు.

ఆ జీవుల్లో నడిచే చేప ఒకటి వెలుగులోకి వచ్చిందని లోతైన సముద్రంలో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కొత్త జాతులలో అనేక ప్రత్యేకమైన పగడాలు, స్పాంజ్‌లు, సముద్రపు అర్చిన్‌లు, యాంఫిపాడ్‌లు, స్క్వాట్ ఎండ్రకాయలు ఉన్నాయని స్మిత్ ఓషన్ పేర్కొంది.

లోతైన సముద్రపు పర్వతాలపై కొత్త జాతులు కనుగొన్నారు శాస్త్రవేత్తలు.. ఈ సముద్ర పర్వతాలు 3,530 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి.

పర్యావరణ వ్యవస్థలో డేటాను సేకరించేందుకు శాస్త్రవేత్తలు 4,500 మీటర్ల లోతుకు దిగగలిగే రోబోను ఉపయోగించారు.

జీవసంబంధమైన ఆవిష్కరణలే కాకుండా, శాస్త్రవేత్తలు 52,777 చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని కూడా మ్యాప్ చేశారు.

శాస్త్రవేత్తల యాత్రకు డాక్టర్ జేవియర్ సెలెన్స్ నాయకత్వం వహించారు. 'తాము కనుగొన్న కొత్త జాతుల మొత్తం ఆశ్చర్యకరంగా ఉంది' అని జేవియర్ అన్నారు.