వీరు అరటిపండు, పాలు కలిపి తింటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.. 

04 April 2024

TV9 Telugu

Pic credit - Pexels

చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితో గాని అరటి పండును తీసుకోవడం సరికాదు

అరటి పండు పాలు కలిపి

చాలా మంది ప్రజలు ఫిట్‌గా ఉండటానికి అరటిపండు, పాలు తినడానికి ఇష్టపడతారు. అయితే కొంతమందికి ఇలా తినడం అనారోగ్యకరమైనదని కూడా రుజువు అయిందని మీకు తెలుసా

ఫిట్నెస్ కోసం 

అరటిపండులో భారీగా ఐరన్, ఫోలేట్ ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, లుటిన్, విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

అరటిలో పోషకాలు

క్యాల్షియం, విటమిన్ ఎ, డితో పాటు అయోడిన్ సహా అనేక ఇతర పోషకాలు పాలలో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పాలులో పోషకాలు

పాలు , అరటిపండు కలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు, దగ్గు, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, విరేచనాలు వంటి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.

పాలు, అరటి కలయిక

అరటి పండు పాలు కలయిక ఆస్తమా, జీర్ణ వ్యవస్థలో ఇబ్బంది, సైనస్ సమస్యలతో బాధపడేవారితో సహా కొంతమందికి హానికరం.

ఎవరికి హానికరం అంటే 

ఆస్తమా రోగులు పాలు, అరటిపండు కలిపి తినకూడదు. దగ్గు సమస్యలను కలిగిస్తుంది. ఆస్తమా రోగి అయితే, ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.

ఆస్తమా రోగులకు 

జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే అరటిపండు, పాలు కలిపి తినకూడదు. ఇది జీర్ణ సమస్యను మరింత పెంచవచ్చు.

జీర్ణ వ్యవస్థలో సమస్యలు