అవతారమూర్తైన 'అమ్మ' కోసం మీరివ్వగలిగిన కానుక ఇదే!

May 12, 2024

TV9 Telugu

TV9 Telugu

ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉంటాయంటారు. కానీ ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక అద్భుతం అమ్మ మాత్రమే.. ఓ తల్లికి అసలైన పుట్టుక తను మరో బిడ్డకు జన్మనివ్వడం

TV9 Telugu

తల్లి కాగానే తన గారాలపట్టిని చూసుకుని మురిసిపోతుంది. ఇక ఆమె సంతోషానికి అవధులే ఉండవు. ఈ ప్రపంచంలోని ప్రేమనంతా తన బిడ్డకే కావాలంటూ ఆరాటపడుతుంది

TV9 Telugu

బిడ్డకు తల్లైన మరుక్షణంలోనే  బంధం, బాధ్యత, కుటుంబం కోసం ఏమాత్రం స్వార్థం లేకుండా అహర్నిశలూ కృషి చేస్తుంది అమ్మ. అందుకే అమ్మ చూపే స్వచ్ఛమైన ప్రేమకు కొలమానాలు ఉండవు. హద్దులు అసలే ఉండవు

TV9 Telugu

అన్నదమ్ముల్లా మనల్ని ఒకరు ఆడించవచ్చు. అక్కచెల్లెళ్లుగా మనకి ఒకరు తోడుండచ్చు. నాన్నలా ఒకరు మన బాధ్యత తీసుకోవచ్చు. కానీ అమ్మలా మరొకరు మనల్ని చూసుకోలేరు

TV9 Telugu

అమ్మ మనకోసం చేసే త్యాగాలెన్నో. ఏంచేసినా ఆమె రుణం తీర్చుకోలేం. అందుకే ప్రతీయేట మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని సంబరంలా జరుపుకొంటారు. ఆ రోజున అమ్మకు చాలామంది రకరకాల కానుకలు ఇచ్చి, తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు

TV9 Telugu

అటువంటి అమ్మ పైన ప్రేమని వ్యక్తపరచడానికి, మనసారా థ్యాంక్స్ చెప్పుకోవడానికే మనం ఇచ్చే ఏకైక కానుక వారి వృద్ధాప్యంలో వారికి అమ్మై కంటికి పాపలా కాపాడుకోవడమే

TV9 Telugu

రెక్కలొచ్చిన పిల్లలు తల్లిదండ్రులను చితకబాదడం, పట్టెడం అన్నం పెట్టలేక నీచంగా చూడటం, వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడ వంటి ఎన్నో అఘాయిత్యాలకు గురిచేస్తున్నారు నేటి కన్నబిడ్డలు. ఇలా రోజుకు ఎన్నో వందల మంది తల్లులు నిరాశ్రయులు అవుతున్నారు

TV9 Telugu

మాతృదినోత్సవం ఏ ఒక్క రోజుకో పరిమితం కాకూడదు. అన్నివేళలా అన్నీతానై కాపాడిన అమ్మ రుణం ఒక్క రోజులో తీర్చుకునేదికాదు. కానీ వారిపై ప్రేమను తెలియజేస్తూ ఇచ్చే కానుకలకన్నా వారి కంటి వెంట కన్నీరురాకుండా చూసుకోవడమే అసలైన కానుక. ఏమంటారు.. నిజమేనా?