చేతికి వెల్లుల్లి వాసనను ఇలా తొలగించుకోండి..

వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు చర్మంపై ఘాటు వాసనను ప్రేరేపిస్తాయి.

చేతులకు వెల్లుల్లి వాసన రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సబ్బుతో చేతులు పదే పదే కడుక్కున్నా కూడా వెల్లుల్లి వాసన పోదు.

వెల్లుల్లిని కత్తిరించేటప్పుడు వాసన రాకుండా గ్లౌజులు ధరించవచ్చు.

టూత్‌పేస్ట్, మౌత్ వాష్‌లను కలిపి 30 సెకన్ల పాటు చేతులను క్లీన్ చేయాలి.

ఉప్పు, బేకింగ్ సోడాను నీటిలో కలిపి చిక్కటి పేస్ట్ లా చేసి చేతులకు రుద్దుకోవచ్చు.

నిమ్మరసం, నిమ్మ తొక్కను చేతులకు రుద్దడం వల్ల వెల్లుల్లి వాసన తొలగిపోతుంది.

కాఫీ పొడితో చేతులను రుద్దితే ఆ వాసన మొత్తం పోతుంది.