చర్మానికి, జుట్టుకు ‘సహజ’ సౌందర్యం తెచ్చే చిట్కాలు

February  22, 2024

TV9 Telugu

చర్మ సౌందర్యాన్ని, జుట్టును సంరక్షించుకోవడానికి మార్కెట్లో రకరకాల సౌందర్యోత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి అందరికీ పడకపోవచ్చు.. వీటివల్ల కొంతమందిలో పలు దుష్ప్రభావాలూ కనిపిస్తుంటాయి

ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు వినియోగించాలంటున్నారు నిపుణులు. అటువంటి వాటిల్లో పసుపు ముఖ్యమైనది

పసుపు మేనిఛాయను పెంచడంతో పాటు అవాంఛిత రోమాల నివారణ, చర్మంపై ముడతలను నివారిస్తుంది. బియ్యప్పిండిలో పచ్చిపాలు, టొమాటో రసం, కొద్దిగా పసుపుని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే సరి

అలాగే తులసిలోని ఔషధ గుణాలు మొటిమలను నివారించి చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మార్చుతుంది. కొన్ని తులసి ఆకులను తీసుకొని పేస్ట్ చేసుకుని కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి

విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉండే ఉసిరి చర్మంపై చేరిన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ప్రత్యేకించి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కుదుళ్లను దృఢంగా, ఒత్తుగా పెరిగేలా చేసి, తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది

రెండు చెంచాల ఉసిరి రసాన్ని తీసుకొని అంతే మోతాదులో నిమ్మరసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు అప్లై చేసి పూర్తిగా ఆరనిచ్చి, గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే సరిపోతుంది

మొటిమల విముక్తికి వేప ఎంతో మేలు చేస్తుంది. కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి, అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గుతుంది

పొడిచర్మంతో బాధపడే వారు వేప పొడిలో కొన్ని చుక్కల ఏదైనా నూనె ఆయిల్‌ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి