నచ్చిన హెయిర్ చేసుకోవడం ఈ రోజుల్లో అంతకష్టమేమీ కాదు. స్ట్రెయిట్‌గా, కర్లీగా, అలల మాదిరిగా.. ఇలా ఎలా కావాలంటే అలా చిటికెలో మార్చుకోవచ్చు
చాలామంది అమ్మాయిలు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌స్టైలింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు. దీంతో క్షణాల్లో నచ్చిన హెయిర్ స్టైల్‌తో మురిసిపోతుంటారు
అయితే వీటి వల్ల జుట్టు అప్పటికప్పుడు అందంగా కనిపించినా వీటి నుంచి వెలువడే అధిక వేడి కారణంగా కుదుళ్లు, జుట్టు తీవ్రంగా దెబ్బ తింటాయి
జుట్టు చివర్లు చిట్లిపోవడం, జుట్టు పొడి బారిపోవడం, గడ్డి లాగా తయారవడం, తెగిపోవడం వంటి సమస్యలు క్రమంగా తలెత్తుగాయి
ఇలా వేడి కారణంగా దెబ్బతిన్న జుట్టును తిరిగి అందంగా, ఆరోగ్యంగా మలచుకోవాలంటే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు
తేమ కోల్పోయి గడ్డిలా మారిపోయిన పొడిబారిన జుట్టును తిరిగి రిపేర్ చేయడానికి కొబ్బరినూనె చక్కగా పనిచేస్తుంది. ఇది సహజసిద్ధంగా జుట్టును రిపేర్ చేస్తుంది
జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందించి వెంట్రుకల కుదుళ్ల నుంచి బలంగా పెరిగేలా చేయడంతో కొబ్బరి నూనె సహాయపడుతుంది. వేడి వల్ల డ్యామేజ్ అయిన జుట్టుకి ఇది జీవం నింపుతుంది
ఒక గిన్నెలో స్పూన్ ఆర్గాన్ ఆయిల్, 2 స్పూన్ల కొబ్బరి నూనె, విటమిన్ ‘ఇ’ క్యాప్సూల్ , షియా బటర్ కొద్దిగా వేసి బాగా కలుపుకుని జుట్టుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే సరి.