మందార పువ్వులతో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టును పొడవుగా, దృఢంగా మారుస్తాయి.

15 August 2023

ఎర్ర మందార పువ్వులు జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పేర్కొంటారు. దీనిని అప్లై చేసే విధానం కూడా జుట్టు సంరక్షణలో కీలకంగా పేర్కొంటున్నారు. మరి ఆ మందారాన్ని జుట్టుకు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

ఎర్ర మందార

మందార పువ్వులను హెన్నాతో కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. ఇది జుట్టుకు మంచి రంగును కూడా ఇస్తుంది. ఇది జుట్టు సంరక్షణలో కీలంగా పనిచేస్తుంది. 

హెన్నా - మందార

మందార పువ్వులను మెత్తగా రుబ్బి, అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకు రాసుకుని, కాసేపటి తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది.

పెరుగు-మందార

మందార ఆకుల పొడిని బాదం నూనెతో కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. దృఢంగా మారుతుంది. 

ఆల్మండ్ - మందార

ఉసిరికాయ జుట్టుకు దివ్యౌషధంగా పని చేస్తుంది. ఉసిరికాయను, మందారం ఆకును కలిపి పేస్ట్‌‌లా రెడీ చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేయాలి. దాదాపు 40 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత శుభ్రంగా కడగాలి. 

ఉసిరికాయ-మందార ఆకు

కొమ్మరి నూనెలో మందార పువ్వును కలిపి వేడి చేయాలి. ఆ తరువాత చల్లార్చాలి. ఆ నూనెను జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా, పొడవుగా మారుతుంది.

కొబ్బరి నూనె - మందారం

జుట్టు మందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటన్నింటికంటే ముందుగా మంచి ఆహారం తినాలి. సరైన జీవన శైలిని అనుసరించాలి. మంచి ఫుడ్ తిని, మంచి జీవనశైలిని మెయింటేన్ చేస్తే జుట్టు లోపలి నుంచి మెరుగుపడుతుంది.

ఆహారం