చుండ్రు వేధిస్తోందా? ఇలా చెక్ పెట్టండి..

14 September 2023

మీ జుట్టు నిండా చుండ్రు వేధిస్తోందా? ఈ పదార్థాలు చాలా ఫాస్ట్‌గా మొండి చుండ్రును తొలగిస్తాయి. ఖచ్చితంగా ప్రయత్నించండి.

 జుట్టు సంరక్షణ చిట్కాలు

మీరు జుట్టు కోసం ఆపిల్ వెనిగర్ ఉపయోగించవచ్చు. దీని కోసం, కొంత నీటిలో సరిపడా ఆపిల్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు షాంపూ తర్వాత దీనితో జుట్టును కడగాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు మీరు ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు తలకు మసాజ్ చేయాలి.

ఆలివ్ ఆయిల్

తులసి పొడి ఉసిరి పొడిని తీసుకోవాలి. తులసి, ఉసిరి పొడిలో నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని స్కాల్ప్‌కి అప్లై చేసి కాసేపు అలాగే కడిగి పెట్టాలి. 

తులసి

జుట్టు కోసం పెరుగును కూడా ఉపయోగించవచ్చు. పేరుగును తలకు అప్లై చేయాలి. కాసేపు అలాగే ఉంచాలి. అరగంట తర్వాత తలని కడగాలి. మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు

మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని స్కాల్ప్, హెయిర్‌కి సరిగ్గా అప్లై చేయండి. కొంత సమయం తర్వాత ఈ పేస్ట్‌ని కడగాలి. 

మెంతులు

కొంచెం కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో కాసింత నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంతో తలకు మసాజ్ చేయండి.  కొన్ని గంటల తర్వాత తలను బాగా కడగాలి.

నిమ్మకాయ

వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దానికి కాస్త కొబ్బరినూనె కలపాలి. ఈ పదార్థాలను మిక్స్ చేసి తలకు పట్టించాలి. కొంత సమయం తర్వాత తలని శుభ్రం చేసుకోవాలి.

వేప

బాగా తల దురదగా ఉన్నప్పుడు పైన చెప్పిన సూచనలు పాటించడం ద్వారా జుట్టులోని చుండ్రు త్వరగా వదిలిపోతుంది. అంతేకాకుండా.. జుట్టు కూడా ఆరోగ్యంగా, పొడవుగా వస్తుంది.

చుండ్రు