జడ ఎలా వేస్తున్నారు? ఇలా చేస్తే జుట్టు రాలిపోతుంది..

February  15, 2024

TV9 Telugu

ఒత్తుగా ఉన్న జుట్టు కొంచెం.. కొంచెం రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. ఏదో తెలియని దిగులు వెటాడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల చిట్కాలు ట్రై చేస్తుంటాం

దువ్వితే జుట్టు రాలిపోతుందని, పైపైన చిక్కులు తీసి జడ అల్లేసేవారు చాలామంది ఉన్నారు. అలాగే మాడుకి మర్దన చేసినట్లు సున్నితంగా దువ్వడంతోపాటు మరికొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి

అప్పుడే శిరోజాలు ఆరోగ్యంగా, అందంగా ఎదుగుతాయని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి జుట్టు రాలిపోవడం వెనక పోషకాహార లోపాలు, వాతావరణ కాలుష్యం కూడా తోడవుతుంది

వైద్యుల వద్దకు వెళ్లి సరయిన కారణం తెలుసుకొని చికిత్స చేసుకుంటే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. తల దువ్వితే 50-100 వెంట్రుకలు రాలడం సహజమే అంటారు వైద్యులు

ఇంతకు మించి ఊడిపోతుంటే మాత్రం అనారోగ్యమో, పోషకాల లోపమో, శ్రద్ధవహించకపోవడమో నిర్ధరించుకోవాలి. సమతులాహారం తీసుకోవడంతో పాటు కురుల్ని శుభ్రంగా, చిక్కులు లేకుండా ఉంచుకోవడమూ తప్పనిసరి

కొందరు బలంగా దువ్వి, లాగి బిగుతుగా జడ వేస్తుంటారు. ఇలా చేస్తే జుట్టు మరింతగా రాలే అవకాశం ఉంది. హడావుడిగానో, బలంగా ఒత్తిపెట్టో అదీ లేదంటే తడి తలమీద దువ్వినా ఈ సమస్య నుంచి బయటపడలేం

బదులుగా, కాస్త సమయం తీసుకుని వెడల్పాటి పళ్లున్న దువ్వెనతోనో లేదా వేళ్లతోనో చిక్కుల్ని తీశాకే హెయిర్‌స్టైలింగ్‌ చేసుకోవడం మంచిది. మరీ ఎక్కువగా చిక్కు పడితే సీరమ్‌ రాసి విడదీయాలి

సహజంగా నూనెల్ని విడుదల చేసే సెబేషియస్‌ గ్రంథులు దువ్వినప్పుడు ప్రేరేపితమవుతాయి. నేరుగా మాడు నుంచే మొదలుపెట్టకుండా కింది నుంచి ఆరంభించి నెమ్మదిగా పైకి రావాలి. అప్పుడు కురులపై ప్రయోగించే బలం తగ్గి, జుట్టు తెగడం లాంటి సమస్యలూ తగ్గుతాయి