జుట్టుకు జామాకు వైద్యం.. ఇలా చేస్తే ఒత్తైన కురులు మీసొంతం!

April 21, 2024

TV9 Telugu

నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతోన్న సమస్య జుట్టు రాలడం. విపరీతమైన ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం ప్రభావం.. కారణం ఏదైనా కళ్లముందే కురులు రాలుతుంటే ప్రాణం విలవిలలాడుతుంది

అయితే జామాకుతో ఈ సమస్యకు చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. జామ ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయట

ముఖ్యంగా జామాకుల్లో విటమిన్ 'సి' అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది

ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ని శరీరం నుంచి బయటకు పంపించి వెంట్రుకలు డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి

అలాగే జామాకుల్లో ఉండే లైకోపీన్ అనే పదార్ధం హానికారక అతి నీలలోహిత కిరణాల నుంచి జుట్టుని సంరక్షిస్తుంది. గిన్నెలో లీటరు నీటిని పోసి, జామాకులు వేసి 20 నిమిషాల పాటు మరిగించాలి

దీన్ని చల్లారనిచ్చి మరో గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ మిశ్రమం హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత జుట్టు బాగా ఆరనివ్వాలి

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అలాగే కుదుళ్లకు పట్టేలా పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. రెండు గంటల పాలు అలాగే ఉంచుకొని తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడిగేయాలి

ఇలా చేయడం వల్ల కురులు మృదువుగా, సిల్కీగా మారతాయి. జామాకులతో తయారుచేసుకున్న హెయిర్‌ ప్యాక్‌ వేసుకుంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది