గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండడంలో జామ ఆకులు ఉపయోగపడుతాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ సమస్యను దూరం చేయడంలో జామ ఆకులు బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు. రోజూ ఉదయం జామ ఆకుల టీని తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.
జామ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖంపై వచ్చే మచ్చలను ఇట్టే తగ్గేంచేస్తుంది
జుట్టు ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా జామ ఆకులు ఉపయోపగడుతుంది. జామ ఆకులను నీటిలో మరిగించి. ఆ ఆ నీటిని జుట్టు కుదుళ్లలో మసాజ్ చేస్తే జుట్టు కుదుళ్ల నుంచి బలం చేస్తుంది.
డయేరికాకు తక్షణ ఉపశమనంగా జామ ఆకులు ఉపయోగపడుతాయి. శరీరంలో డయేరియాకు కారణమయ్యే స్టాఫీలోకోక్కస్ ఆరెస్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుంది
జామ ఆకుల్లో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది దగ్గు, జలుబు వంటి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కఫం వంటి గొంతు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా జామకాయ నీరు బాగా సహాయపడుతుంది. జామ ఆకులతో టీ కాచుకుని తాగితే మెరుగైన లాభాలు ఉంటాయి
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.