రానున్న రోజుల్లో భారత్‌కు నీటికి కటకట తప్పదా?

26 October 2023

ఇప్పటికే భారత దేశంలోని ఇండో-గ్యాంగెటిక్ బేసిన్ పరిధిలో భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడి.

2025 నాటికి వాయువ్య రాష్ట్రాల్లో భూగర్భ జలాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతాయని అంచనా వేసింది యూఎన్ఓ.

నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పలపై జరిగే కీలక కాప్28 సమావేశానికి ముందు ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.

అధిక వేడి వాతావరణం, కరువు కాటకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని తెలిపిన ఐక్యరాజ్యసమితి నివేదిక.

వాతావరణంలో మార్పులతో హిమాలయ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని.. దీంతో నీటి కటకట ఏర్పడుతుందని తెలిపింది యూఎన్ఓ.

పర్యావరణం పరంగా కనిష్ట స్థాయికి నీటి నిల్వలు పడిపోతే.. పూర్వ స్థితికి చేరడం అసాధ్యంగా పేర్కొన్న ఐక్యరాజ్య సమితి.

భూగర్భ జలాలు పడిపోతే, మొత్తం ఆహరోత్పత్తిపైనే పెద్ద ఎత్తున ప్రభావం పడేలా చేస్తుందని హెచ్చరించింది ఐక్య రాజ్యసమితి.

ప్రపంచంలో భూగర్భ జలాలను అధికంగా వినియోగించే దేశం భారత్. ఈ విషయంలో తరువాత స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.