02 August 2024
TV9 Telugu
Pic credit - Social Media
ఆకుపచ్చ బియ్యం ప్రకాశవంతమైన రంగుని కలిగి ఉంటుంది. ఆకు పచ్చరంగు క్లోరోఫిల్, ఇతర యాంటీఆక్సిడెంట్ల నుండి వస్తుంది. కనుక ఈ బియ్యంతో చేసిన ఆహారం రూపాన్ని, రుచిని మెరుగుపరుస్తుంది.
గ్రీన్ రైస్ లో ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. వీటిని ప్రాసెస్ చేయరు కనుక వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెదురు బియ్యాన్ని వండిన తర్వాత ఆకృతిలో తేడా ఉంటుంది. అన్నం కొద్దిగా జిగటగా ఉన్నా.. తియ్యగా ఉంటుంది. రుచిలో గోధుమని తలపిస్తుంది. వీటితో ఎక్కువగా కిచిడి లేదా ఖీర్ చేస్తారు.
అరుదుగా లభించే వెదురు బియ్యంతో చేసిన ఆహారం తినడం వలన వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు నయం అవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
వెదురు బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది
వెదురు బియ్యంలో కొవ్వు ఉండదు. పైగా శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది. పచ్చ రంగు బియ్యంలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలున్నాయి.
గ్రీన్ రైస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. మెదడుకు సరైన పోషకాలు అందిస్తుంది. మెదడును గుండెను సమన్వయ పరుస్తుంది.
ఈ బియ్యంలో కాల్షియం, భాస్వరం, ఐరెన్ వంటి మూలకాలతో పాటు ఫ్లేవనాయిడ్‌లు, ఆల్కలాయిడ్‌లు అధికంగా ఉన్నాయి. దీని వీటిని తినడం వలన ఎముకలు ఎముకలు దృఢంగా మారుతాయి
ఆకుపచ్చ రంగు బియ్యంలో B విటమిన్లు, ముఖ్యంగా B6 అధికంగా ఉంటుంది. దీంతో రక్తహీనత బాధపడేవారికి మంచి ఆహారం ఈ బియ్యం.