నల్ల మిరియాల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ అలెర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ గ్యాస్, డైయూరిటిక్, డైజెస్టివ్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మిరియాలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కె, ఐరన్, కాపర్, మాంగనీస్ ఉంటుంది.
ఇవి జీర్ణవ్యవస్థను, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడుతాయి.
మిరియాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. షుగర్‌తో బాధపడేవారికి సైతం మిరియాలు బెస్ట్ ఎంపిక.
నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగుతాయి. నల్ల మిరియాల్లోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి.
నల్ల మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ప్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి.
మిరియాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపు, దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి. మిరిఇయాలు తింటే ఆస్తమా, వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని తగ్గుతాయి.
మిరియాలను తీసుకోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. దీంతో పాటుగా శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి. నల్ల మిరియాలలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి.