పంటి నొప్పికి అమ్మమ్మల కాలంనాటి ఇంటి వైద్యం

12 October 2024

TV9 Telugu

TV9 Telugu

తీపి పదార్థాలు ఎక్కువ తినటం, తిన్నాక నోటిని పుక్కిలించక పోవడం.. వంటి కారణాల వల్ల దంతాల సమస్యలు వస్తాయి. ఒక్క సారి దంత సమస్యలు వస్తే భరించలేనంత నొప్పి వస్తుంది

TV9 Telugu

పంటి నొప్పికి రకరకాల మందులు వాడే బదులు, అమ్మమ్మల కాలంనాటి ఈ హోం రెమెడీని ప్రయత్నించండి. ఇట్టే పంటి నొప్పి తగ్గిపోతుంది

TV9 Telugu

మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలు, కొంచెం ఉప్పు కలిపి మెత్తగా చేసుకోవాలి. దాన్ని సమస్య ఉన్నచోట ఉంచాలి. వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు, అల్లిసిన్‌ వంటివి నొప్పి తగ్గించడంలో సాయపడతాయి

TV9 Telugu

కప్పు మరిగిన నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. ఆ నీటితో రోజులో మూడు నాలుగుసార్లు నోటిని పుక్కిలిస్తే సరి. వెచ్చగా ఉన్న టీ బ్యాగులను నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచినా మంచిదే

TV9 Telugu

చర్మసంరక్షణలో, కాలిన గాయాలకు ప్రథమ చికిత్సగా కలబందను ఉపయోగించినట్లే.. చిగుళ్ల నొప్పిని దూరం చేయడానికీ దీని సాయం తీసుకోవచ్చు

TV9 Telugu

సమస్య ఉన్న ప్రాంతంలో కలబంద గుజ్జును రాసి, కొద్దిసేపు మర్దనా చేయాలి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు దంత క్షయానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి

TV9 Telugu

గ్లాసు గోరువెచ్చని నీటిలో స్పూను ఉప్పును కలిపి 30 సెకన్ల చొప్పున రోజులో కొన్నిసార్లు పుక్కిలించి ఊయండి. దంతాల మధ్య పేరుకుపోయిన ఆహారపదార్థాలు పూర్తిగా తొలగిపోతాయి

TV9 Telugu

అంతేకాకుండా సూక్ష్మజీవులు నశించి, గాయమూ మానుతుంది. మధ్య మధ్యలో చల్లటి కాపడం పెడితే వాపు తద్వారా నొప్పి కూడా తగ్గుతుంది. అయినా పంటి నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి