త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లు

TV9 Telugu

12 February  2024

టోల్ ప్లాజా వ్యవస్థల స్థానంలో త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలు రానున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఈ జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో ఆటోమేటిగ్గా నెంబర్ ప్లేట్ ను గుర్తించే సాంకేతికత ఉంటుంది.

హైవేలపై నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలు ఓ వాహనం రోడ్డెక్కినప్పటి నుంచి అది హైవేపై ఎంత దూరం ప్రయాణిస్తుందో గుర్తిస్తాయి.

నూతనంగా తీసుకువస్తున్న ఈ జీపీఎస్ టోల్ సిస్టమ్ ప్రకారం... ఓ వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

సదరు వాహనం ఎన్ని టోల్ ప్లాజాలు దాటి వచ్చిందో ఈ జీపీఎస్ వ్యవస్థ నమోదు చేస్తుంది. దాని ఆధారంగానే టోల్ ఫీజును లెక్కిస్తారు.

ఇప్పటివరకు ఆయా టోల్ ప్లాజాల వద్ద ఫిక్స్ డ్ చార్జీలను చెల్లించాల్సి వచ్చేది. ఈ వ్యవస్థలో వాహన డ్రైవర్ బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయాల్సి ఉంటుంది.

తద్వారా లెక్కించిన మొత్తం టోల్ ఫీజు ఆటోమేటిగ్గా వాహనం యజమాని అకౌంట్ నుంచి మినహాయించుకుంటారు NHAI అధికారులు.

కొత్త విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణం సాధ్యమవుతుంది.