ఫాస్టాగ్ విధానంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారనే వాదన ఉంది. ప్రయాణించిన దూరాన్ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా టోల్ వసూలు చేస్తున్నారనేది వారి ఆవేదన.
అయితే, కొత్త టెక్నాలజీ GNSS వారికి ఎంతో ఉపశమనాన్ని కల్పిస్తుంది. టోల్ రోడ్డుపై వాహనం ప్రయాణించే ఖచ్చితమైన దూరం ఆధారంగా టోల్ లెక్కిస్తుంది.
ఉపగ్రహ సమాచారం వినియోగించుకుని ఈ వ్యవస్థ పనిచేస్తుంది. హైవేలో ప్రయాణం ప్రారంభించిన స్థానం మొదలుకుని నిష్క్రమించే వరకూ లెక్కించి టోల్ తీసుకుంటుంది.
టోల్ హైవేలోకి ప్రవేశించినప్పుడు ఉపగ్రహం ద్వారా ప్రయాణాన్ని ట్రాక్ చేస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మొత్తం దూరం ఆధారంగా చార్జీని లెక్కిస్తుంది.
జీఎన్ఎస్ఎస్ టోల్ వసూలు పద్ధతిని ఇప్పటికే చాలా యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్నారు. ఇకపై తక్కువ దూరానికి ఎక్కువ చార్జీ చెల్లించాల్సిన పని లేదు.
ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ టోల్ ఎగవేత అవకాశాలను తగ్గించడంతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
బెంగళూరు-మైసూర్ (NH-275), పానిపట్-హిసార్ జాతీయ రహదారి (NH-709)లో కేంద్రం ఇప్పటికే GNSS పరీక్షను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
త్వరలోనే అన్నే హైవేలపై ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) టోల్ పద్దతిని అమలు చేయనుంది ప్రభుత్వం.