ఫాస్టాగ్‌ ఈ - కేవైసీ గడువు పెంపు..

TV9 Telugu

03 February 2024

దేశవ్యాప్తంగా జిల్లాలు, రాష్ట్రాల మధ్య తిరగడానికి ప్రజలు హైవేపై ప్రయాణం చేస్తారు. దీనికి NHAI టోల్ తీసుకుంటుంది.

దీనికోసం లైన్ లో వేచి ఉండకుండా త్వరగా వెళ్ళడానికి ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తున్నారు దేశవ్యాప్తంగా చాలామంది వాహనదారులు.

ఫాస్టాగ్‌ల ఈ - కేవైసీ పూర్తి చేసేందుకు గడువును మరో నెల రోజులు ఫిబ్రవరి 29 వరకు పొడిగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది.

(NETC) వెబ్‌సైట్‌ ద్వారా కేవైసీ చేసుకోవచ్చని తెలిపింది. అంతకుముందు జనవరి 31 వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే.

ఫాస్టాగ్‌ కేవైసీ స్టేటస్‌ తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ల లింక్‌పై క్లిక్ చేయాలి.మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.

డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ కేవైసీ స్టేటస్‌ కనిపిస్తుంది. కేవైసీ పూర్తి కాకపోయి ఉంటే అడిగిన వివరాలు సమర్పించి ప్రాసెస్‌ చేయాలి.

మొబైల్‌ నంబర్‌ ఎన్‌హెచ్‌ఏఐ వద్ద రిజిస్టర్‌ కాకుంటే.. ‘మై ఫాస్టాగ్‌’ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ చేసుకోవాలి.

బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్‌లు అయితే బ్రాంచ్‌కి వెళ్లి మొబైల్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తర్వాత కేవైసీ పూర్తి చేసుకోవాలి.