TV9 Telugu
పిజ్జా ప్రియులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలి పిజ్జా ఏటీఎం
14 Febraury 2024
నగదు లావాదేవీలకు ఏటీఎం ఉపయోగిస్తాం. హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంను కూడా చూశాం. తాజాగా పిజ్జా ఏటీఎం వచ్చేసింది.
కేవలం మూడే మూడు నిమిషాల్లో వేడి వేడి పిజ్జా మనకందించే ఏటీఎం చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు సమీపంలో ఏర్పాటు చేశారు.
పర్యాటకులకు హాట్‌స్పాట్‌గా ఉన్న సుఖ్నా సరస్సు ఇపుడు పిజ్జా వెండింగ్ మెషీన్‌తో మరింత ఎట్రాక్టివ్‌గా మారింది.
ప్రకృతి అందాలకే కాదు రుచికరమైన పిజ్జాకు కేంద్రంగా సుఖ్నా సరస్సు మారింది. పిజ్జా ప్రియులకు వీకెండ్ డెస్టినేషన్‌గా తయారైంది.
గత నెల దీన్ని ఇన్‌స్టాల్ చేసినప్పటి నుంచీ విపరీతమైన ఆదరణ లభిస్తుంది. రోజుకు 100 కు పైగా ఆల్ వెజిటేరియన్ పిజ్జాలను సిద్ధం చేస్తోంది.
వారాంతాల్లో ఈ సంఖ్య 200-300 మధ్య ఉంటుంది. డొమినోస్, పిజ్జా హట్ తో పోలిస్తే దాదాపు 35 శాతం తక్కువ ధరకే అందిస్తున్నారు.
మెషిన్‌లో కావలసిన పిజ్జా ఫ్లేవర్‌ను నమోదు చేయగానే రోబోట్ పిజ్జా బేస్‌ని ఎంచుకొని, దానిని కాల్చి, కేవలం మూడు నిమిషాల్లో సర్వ్ చేస్తుందట.
మీరు చండీగఢ్ టూరుకి వెళ్తే మాత్రం కచ్చితంగా ఈ పిజ్జా ఎటిఎంలో పిజ్జాని టేస్ట్ చెయ్యండి. ఇది తక్కువకే లభిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి