సబ్‌మెరైన్‌లో వెళ్లి సముద్ర గర్భంలో ‘ద్వారకా’ చూస్తారా?
28 December 2023
TV9 Telugu
శ్రీకృష్ణుడి పాలించిన ద్వారకా పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి వేలాది మంది భక్తజనం వేచి చూస్తున్నారు.
మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ఈ సుందర నగరం అరేబియా సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు.
ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు చూసేందుకు వీలుగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం జలాంతర్గామి సేవలు ప్రారంభించనుంది.
మహారాష్ట్ర రాజధాని ముంబయికి చెందిన ఓ ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజాగాన్‌తో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
ద్వాపరయుగం తరువాత అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే అవకాశం వస్తున్నందుకు యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ జలాంతర్గామి 24 మంది యాత్రికులను అరేబియా సముద్రంలో 300 అడుగుల కింద వరకు తీసుకెళ్తుందని తెలుస్తోంది.
పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు గుజరాత్ ప్రభుత్వ అధికారులు.
ఇది ఇప్పట్టినుంచి అందుబాటులోకి రానుందో గుజరాత్ ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. దీనికోసం భక్తులు వేచి చూస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి