అందం కోసం పాము రక్తం తాగే ఊరు..!

March 28, 2024

TV9 Telugu

అందంగా కనించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో ఫార్ములా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా మగువలు ఎన్నో రకాలుగా సౌందర్య పోషణకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు

అయితే ఈ దేశంలోని ఆడవారు మాత్రం మరో అడుగు ముందుకేసి తాము అందంగా కనిపించాలనే వాంఛతో ఏకంగా పాముల రక్తం తాగేస్తారట

అబ్బే.. ఇదేం పద్ధతి అని పెదవి విరిచేస్తున్నారా? అవునండి.. ఇండోనేషియాలోని మహిళలు అందంగా కనిపించడానికి టీ, కాఫీ మాదిరి భయంకరమైన పాములను చంపి వాటి రక్తాన్ని తాగేస్తున్నారు

మనమైతే విష సర్పాన్ని చూసి భయంతో అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్‌ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు

వాటి రక్తం తాగితే శరీరం ఫిట్‌గా, అందంగా ఉంటుందని వారు ప్రగాఢంగా నమ్ముతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా, ఆరోగ్యం బాగుంటుందట. అందుకే అక్కడి వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమేకాకుండా వాటి మాంసాన్ని ఆహారంగా తింటారట

ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. దీని కారణంగా జకార్తాలో ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట అక్కడి ప్రజలు

ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం స్టాల్స్‌ రోడ్ల పక్కన దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ సమయంలో పాము రక్తాన్ని తప్పక తాగుతారట

అయితే పాము రక్తాన్ని తాగిన తర్వాత సుమారు 3-4 గంటల వరకు టీ, కాఫీ తాగకూడదట. మనం ఆఫీస్‌లు, కాలేజీల్లో.. టీ, కాఫీలు ఎప్పుడుపడితే అప్పుడు ఎలాగైతే తాగుతామో అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు