చలికాలంలో వేడివేడిగా అల్లం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. 

09 December 2024

Pic credit - Getty

TV9 Telugu

 టీ ప్రియులకు కొదవ ఉండదు. అయితే చలికాలంలో వేడి వేడి అల్లం టీ తీసుకోవాలని కోరుకుంటారు. ఈ టీ తాగితే మూడ్ ఫ్రెష్‌గా మారుతుంది,

అల్లం వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కనుక చలికాలంలో దీని వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అల్లం టీలోని విటమిన్లు, మినరల్స్ గురించి తెలుసుకుందాం

అల్లంలో ఉండే ప్రధాన యాంటీ ఆక్సిడెంట్ జింజిరాల్.  అంతేకాదు విటమిన్ B6 తో పాటు విటమిన్ సి మంచి పరిమాణంలో ఉంటుంది.

అల్లంలో కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఐరన్ కూడా ఉన్నాయి. ఇందులో తక్కువ మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది

టీలో అల్లం వేసుకోవడమే కాదు డికాక్షన్ తయారుచేసి తాగవచ్చు. అల్లంతో చేసిన పచ్చడి, అల్లం బెల్లం మిఠాయి కూడా రుచికరమైనవి, పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి 

అల్లం టీ జలుబు, దగ్గు , గొంతు నొప్పి నుండి గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే పాలు లేకుండా టీ తీసుకోవడానికి ట్రై చేయండి.

అల్లం చలికాలంలో మార్నింగ్ సిక్‌నెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ వస్తే అల్లంని దంచి నీళ్లవేసి మరిగించి సిప్ బై సిప్ తాగండి 

  అల్లం తీసుకోవడం శీతాకాలంలో కండరాల దృఢత్వం, నొప్పి, వాపు నుంచి ఉపశమనాన్ని అందించడంలో కూడా ప్రభావవంతంగా  ఉంటుంది .