జీర్ణశక్తి మెరుగుపడాలంటే పాలల్లో ఈ రెండూ కలిపి తాగాలి

29 December 2023

TV9 Telugu

పాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. పాలల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే రోజుకి గ్లాసుడు పాలు తాగమని వైద్యులు చెబుతుంటారు

ఎముకలను ధృడంగా ఉంచడంలోపాటు దంతాలను గట్టిగా చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడంతో సహా ఎన్నో రకాలుగా పాలు దోహదపడతాయి

అయితే సాధారణ పాలను తాగడానికి బదులుగా పాలల్లో కాసింత శొంఠి, అల్లం కలుపుకుని తాగితే మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు 

పాలల్లో శొంఠి, యాలకులు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమేకాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయం అవుతాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పాలను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. నీరసం, బలహీనతలు వంటివి దూరం అవుతాయి

అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు కూడా శొంఠి, యాలకులు కలిపిన పాలను నిరభ్యంతరంగా తాగొచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఇన్పెక్షన్‌లు, వాతావరణం మార్పుల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు దరి చేరకుండా రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. దగ్గు, గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో టీ స్పూన్ శొంఠి పొడి, ఒకటిన్నర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేస్తే చలికాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు