మహిళలకు అల్లం వరంలాంటిదని చెప్పాలి. ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పికి చెక్ పెట్టడంలో అల్లం టీ ఎంతో ఉపయోగపడుతుంది.
అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థ్రయిటీస్ నొప్పుల నుంచి ఉపశమనం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా అల్లం బాగా పనిచేస్తుంది. ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.
వాంతులు, వికారం వంటి భావన కలుగుతుంటే కూడా అల్లం బాగా పనిచేస్తుంది. ఒక చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకొని రసం మింగుతుండాలి. ఇలా చేస్తే సమస్య దూరమవుతుంది.
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా.? అయితే కచ్చితంగా తీసుకునే ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌కి కారణమైన ప్రోస్టాగ్లాండిన్ల ఉత్పత్తిని అల్లం సమర్థంగా అడ్డుకుంటుంది.
అల్లం క్యాన్సర్‌ను తరిమికొట్టడంలో కూడా దోహదపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు కూడా అల్లాన్ని కచ్చితంగా తీసుకోవాలి. ఇందులోని మంచి గుణాలు రక్తపోటును అదుపులో ఉంచి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.