నెయ్యిలో విటమిన్ ఎ,డి,ఇ, కెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉండచంలో ఉపయోగపడుతాయి. చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరం చేస్తాయి.
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎముకలు, కీళ్ల మంటలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నెయ్యిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం దూరమవుతుంది
కంటి చూపును మెరుగుపరచడంలో కూడా నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కళ్ల కింద వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
సాధారణంగా నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.