28 October 2023
చలికాలం మొదలైంది. ఈ సీజన్‌లో చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు.
వేడి నీటితో స్నానం చేసిన తర్వాత ప్రజలు ఉల్లాసంగా ఉంటారు. చలి నుండి రక్షణ ఇస్తుంది. ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో నెయ్యిని చేర్చవచ్చు.
మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా నెయ్యి కలుపుకుంటే శరీరానికి చాలా మేలు చేస్తుంది. దీని వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
చలికాలంలో వేడి నీళ్లతో ఎక్కువగా స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. నెయ్యిలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. దీంతో చర్మం పొడిబారదు.
చలికాలంలో గోరువెచ్చని నీటితో దేశీ నెయ్యి కలిపి స్నానం చేయండి. శరీర ఉష్ణోగ్రతను చక్కగా ఉంచడమే కాదు రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.
తలనొప్పితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో దేశీ నెయ్యి కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన తాజాగా.. రిఫ్రెష్‌గా ఉంటారు
నెయ్యిలో అనేక పోషకాలు, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. దేశీ కలిపి తలస్నానం చేయడం వల్ల చర్మం దురద సమస్య పోతుంది.