గుడ్డు పెంకులను ఇలా వాడారంటే ఒత్తైన జుట్టు మీ సొంతం
January 18, 2024
TV9 Telugu
గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే గుడ్డు వినియోగించిన తర్వాత దాని పెంకులను పడేస్తున్నారా? ఇకపై అలా చేయకండి
ఎందుకంటే గుడ్డు పెంకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. జుట్టు ఎదుగుదలకు, చర్మం సౌందర్యానికి ఇవి ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు
చర్మం సాగిపోవడం వల్ల ముడతలు పడి, గీతల్లా ఏర్పడుతుంటాయి. వీటివల్ల వయసు పైబడిన వారిలా కనిపిస్తుంటారు. గుడ్డు పెంకులతో ఈ ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చర్మం బిగుతుగా ఉంటుంది
గుడ్డు పెంకుల పొడి, ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్ తేనె, టేబుల్‌స్పూన్ పాలు, కొద్దిగా గులాబీ నీరు తీసుకుని వీటన్నింటినీ పాత్రలో వేసుకుని బాగా కలుపుకోవాలి
బీటర్ సహాయంతో కలుపుకుంటే బెటర్. ఈ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి చర్మంపై కింది నుంచి పైకి, బయటి నుంచి లోపలి వైపుకి అప్లై చేసుకోవాలి
ఇలా చేశాక అరగంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా తరచూ చేస్తుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది
గుడ్డు పెంకులతో ఒత్తైన జుట్టును కూడా సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా కొన్ని గుడ్డు పెంకుల పొడిని ఒక గిన్నెలో తీసుకుని అందులో సరిపడా పెరుగు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి
ఈ మిశ్రమాన్ని కుదుళ్లు, జుట్టుకు పట్టించి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. ఈ ప్యాక్ జుట్టు ఎదుగుదలను ప్రేరేపించి, మెరుపును తీసుకొస్తుంది