ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో వెల్లుల్లి ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లి సొంతం.
ఇలా ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లి పొట్టలో కొవ్వు కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఉదయం వెల్లుల్లి తీసుకోవడం వల్ల పొట్టలో కొవ్వు కరిగించవచ్చని న్యూట్రిషినిస్టులు సూచిస్తున్నారు. కాబట్టి ఉదయం వెల్లుల్లి తీసుకోవాలని చెబుతున్నారు.
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ శరీరంలోని మలినాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగడంలో ఉపయోగపడుతుంది.
వెల్లుల్లిని నేరుగా తీసుకుంటే మంచిదని, జీవక్రియల వేగం పెంచే ఔషధాలు ఉండడంతో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయానాలల్లో తేలింది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ఈ విషయాలను తెలిపారు.
ప్రతీ రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో వెల్లుల్లిని నానబెట్టి ఆ నీరు తాగడం, వెల్లుల్లి కలిపిన నిమ్మరసం, తేనెలో వెల్లుల్లి రసం, వెల్లుల్లి గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి.
అయితే వెల్లుల్లిని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోకుండా, రోజురోజుకీ పెంచుకుంటూ పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అందరికీ వెల్లుల్లి పడదని గుర్తుపెట్టుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.