ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి అనేక కారణాలతో సంతాన లేమి సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు.
అయితే ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి.
ఇకపోతే, గంజాయి వినియోగం పురుషుల వీర్య నాణ్యతపై గణనీయమైన ప్రభావం చూపదని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది.
ఈ పరిశోధనలో కొంతమంది పురుషుల వీర్య నమూనాలను విశ్లేషించారు. వీర్య పరిమాణం, అలాగే వీర్య సంఖ్య, వీర్య సాంద్రత, వీర్యం కదలిక వంటి అంశాలను పరిశీలించారు.
ఈ ఫలితాల్లో గంజాయి వినియోగదారులు, వినియోగించని వారి మధ్య ఎలాంటి గణనీయమైన తేడాలు లేవని తేలింది.
అయితే మరికొందరి పరిశోధనల ప్రకారం గంజాయి వినియోగం వీర్య ఆకృతి, వాటి పరిమాణాన్ని తగ్గించవచ్చని సూచించాయి.
దీనిని బట్టి చూస్తే.. గంజాయి వినియోగం వీర్య నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక వినియోగం విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.