ఏడాదికి రెండు సార్లు ఎన్టీఆర్‌ బర్త్ డే సెలెబ్రేషన్స్.. అసలు నిజం చెప్పిన తారక్

Phani CH

20 May 2025

Credit: Instagram

ఈ రోజు ఎన్టీఆర్‌ తన 42వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తన బర్త్ డే రోజు హడావుడి లేకుండా తన ఫ్యామిలీతోనే గడుపుతాడు తారక్.

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్‌ ఏడాదికి రెండు పుట్టిన రోజులు జరుపుకుంటారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. దానికి కారణం తారక్‌ రివీల్‌ చేశారు.

ఎన్టీఆర్‌ సహజంగా తాన పుట్టిన రోజు మే 20న జరుపుకుంటారు.. ఇది అందరికి తెలిసిన విషయమే.. దీనికంటే ముందు మార్చి 26 న కూడా తారక్ కేక్ కట్ చేస్తారు.

మార్చి 26 తన లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజున కావడం విశేషం. ఆ రోజు తన ఇంట్లో భార్య ప్రణతితోపాటు ఎన్టీఆర్‌ కూడా కేట్‌ కట్‌ చేస్తాడు.

దీని వెనుక కారణం 2009 మార్చి 26న ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తుండగా తారక్‌ కారు రోడ్డు జరిగిన విషయం అందరికి తెలిసిందే.

చాలా చోట్ల ఎముకలు విరిగి గట్టి దెబ్బలు తగలడం తో దాదాపుగా తారక్ బతకడం అసాధ్యం అనుకున్నారంతా. అలాంటి స్థితి నుంచి ఎన్టీఆర్ కోలుకున్నాడు తారక్.

అందుకే తారక్ అది తన పునర్జన్మ అని భావిస్తాడు ఎన్టీఆర్‌. అయితే ఆ తర్వాత తన జీవితంలోకి వచ్చిన లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు మార్చి 26నే కావడం విశేషం. 

దీని వెనుకాల ఏదో శక్తి ఉందని, తన కోసమే ప్రణతి పుట్టిందని ఎన్టీఆర్‌ నమ్ముతాడట. అందుకే అందుకే ఆమె పుట్టిన రోజు తాను కూడా మళ్లీ పుట్టానని చెప్పి బర్త్‌ డే సెలబ్రేట్‌ చేసుకుంటాడట తారక్‌.