ఆయుర్వేదంలో మొనగాడు మొక్క! ఔషధ గుణాలు అనేకం..

13 January 2025

Jyothi Gadda

TV9 Telugu

గడ్డి చామంతి మొక్కలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఈ ఆకు రసం చర్మ అంటు వ్యాధులున్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

TV9 Telugu

ఈ చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నడుం, వెన్ను నొప్పి సమస్యలను నివారిస్తుంది. గాయం తగిలిన చోట ఈ ఆకు రసాన్ని ఉపయోగిస్తే నొప్పులు తగ్గిపోతాయి.

TV9 Telugu

రాలుతున్న జుట్టు పెరుగుదలకు గడ్డి చామంతి చక్కగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. 

TV9 Telugu

గడ్డి ఛామంతి ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్ లక్షణం ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ఆకులను నేరుగా నమిలి తిన్నా ప్రయోజనం ఉంటుంది. 

TV9 Telugu

ఈ చామంతి ఆకులకు తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది. గడ్డి చామంతి ఎండిన ఆకులతో పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

TV9 Telugu

ఈ ఆకులను మెత్తగా రుద్ది పేస్ట్‌లా చేసుకుని ఆవనూనెలో కలిపి మరిగించాలి. చివరిగా ఆ నూనెను వడకట్టి ఒక బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేయాలి.

TV9 Telugu

ఇలా చేసుకున్న నూనెను రెగ్యులర్‌గా ఉపయోగిస్తే జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు ఒత్తుగా మారుతుంది, చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

TV9 Telugu

ఇక ఈ ఆకులను కషాయం చేసుకొని తాగిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ కషాయాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

TV9 Telugu