బీపీని తరిమికొట్టడంలో ఆరెంజ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి బీపీని కంట్రోల్ చేస్తుంది.
ఇక రోజుకో కివీ పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. కివిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇక మామిడి పండ్లు కూడా బీపీనీ కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో కచ్చితంగా వీటిని తీసుకోవాలి.
బీపీ ఉన్న వారు పుచ్చకాయను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్, విటమిన్ సి, పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తాయి.
బీపీని తగ్గించడంలో అరటి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం బీపీని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.
దానిమ్మను తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు రక్త నాళాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది.
ప్రతీ రోజూ ఒక కొబ్బరి బోండాన్ని తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి తోడ్పడుతుంది. శరీరంలో రక్తపోటు స్థాయిని సాధారణంగా ఉంచుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.