వర్షకాలంలో ఈ పండ్ల తింటే.. మీ పని ఇక అంతే..
TV9 Telugu
13 June 2024
వర్షకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో పండ్లు, కూరగాయలు తొందరగా కుళ్లిపోతాయి.
ఇవి ఆరోగ్యానికి మేలు చేయడం కాదు.. అనారోగ్య సమస్యలను మరింత పెంచుతాయి. ముఖ్యంగా వర్షకాలంలో తినకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.
వర్షకాలంలో ప్రారంభమైంది. ఈ సీజన్ ప్రారంభంలో మామిడి పండ్లను తినేస్తుంటారు. కానీ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఈ సీజన్లో మామిడి పండ్లను తినకూడదు. ఇందులో ఫంగల్, బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదం.
పుచ్చకాయ ఆరోగ్యమే అయినప్పటికీ.. దీనిని వర్షాకాలం తీసుకుంటే మాత్రం హాని కలిస్తుందని అంటున్న నిపుణులు.
అత్యంత ఎక్కువ శాతం నీరు ఉండే పండు పుచ్చకాయ. కానీ వర్షకాలంలో మాత్రం దీనిని తింటే అనేక రకాల కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది.
వర్షకాలంలో ఆకు కూరగాయలను తినకపోవడమే మంచిది. ఈ కూరగాయలలో కీటకాలు, బ్యాక్టీరియా పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.
కొన్నిసార్లు మురికి నీరు ఈ ఆకు కూరగాయలను కలుషితం చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి