బరువు తగ్గాలనుకునే వారు నీటి శాతం అధికంగా ఉండే వాటర్ మిలాన్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ఊతమిస్తుంది.
ఆరెంజ్ ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్, విటమిన్ సి బరువు తగ్గడంలో తోడ్పడుతాయి.
ద్రాక్ష పండ్లు కూడా బరువు కంట్రోల్ చేయడంలో దోహదపడతాయి. వీటిలోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గొచ్చు.
కివీ పండ్లలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు యాపిల్స్‌ను తీసుకోవాలి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తరచూ తినడంవల్ల కూడా సులువుగా బరువు తగ్గవచ్చు.
ఇక సీజన్‌తో సంబంధం లేకుండా లభించే అరటి పండ్లను తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ సాయంత్రం అరటి పండును తీసుకుంటే ఇట్టే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు.
బెర్రీలను ప్రతీ రోజూ తీసుకుంటే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.