చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అధికమంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. వీటిని కుటుంబంలో ఓ సభ్యుడిగా భావిస్తుంటారు
TV9 Telugu
రోజూ క్రమం తప్పకుండా స్నానం చేపించడం, తాము తినే ఆహారాన్నే పెంపుడు కుక్కలకు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇదంతా వాటిపై ఉన్న ప్రేమకారణంగానే చేస్తుంటారు
TV9 Telugu
కానీ ఇలా చేయడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మనం తినే ఆహారం కుక్కలకు ఆహారంగా అస్సలు ఇవ్వకూడదంట. పెంపుడు జంతువులకు ఇచ్చే ఆహారం దాని వయస్సు, జాతిపై ఆధారపడి ఉంటుంది
TV9 Telugu
ముఖ్యంగా మీ పెంపుడు జంతువు కుక్క అయితే మరింత శ్రద్ధ అవసరం. పెట్ డాగ్‌కి తెలిసీ తెలియక మీరిచ్చే దానికి హాని కలిగించవచ్చు
TV9 Telugu
చాలా మంది వ్యక్తులు తమ పెంపుడు జంతువులను ఆరోగ్యంగా ఉంచడానికి రెగ్యులర్ సీజనల్ పండ్లను కూడా తినిపిస్తుంటారు. అయితే, అన్ని రకాల పండ్లు పెంపుడు కుక్కల ఆరోగ్యానికి మేలు చేయవు
TV9 Telugu
మరైతే పెడ్ డాగ్‌లకు ఏ పండ్లు తినిపించాలి? అనే సందేహం మీకూ ఉన్నట్లయితే ఈ విషయం తెలుసుకోండి. యాపిల్స్‌లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
వీటిల్లో పెంపుడు జంతువుల దంతాలను బలపరిచే మాలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అయితే ఆపిల్ విత్తనాలలో సైనైడ్ ఉంటుంది
TV9 Telugu
వీటిని తొలగించిన ముక్కలను పెడ్ డాగ్‌లకు తినిపించాలి. అలాగే మామిడి పండ్లను కూడా తినిపించవచ్చు. అయితే మామిడికాయ తొక్క తీసి తినిపించాలి. లేదంటే పెట్‌డాగ్‌కు చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
TV9 Telugu
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మీ పెంపుడు జంతువులో పొటాషియం లోపం ఉంటే, అరటిపండ్లు వాటికి తినిపించవచ్చు. కానీ తొక్క తీసి తినిపించాలి. తొక్క తీయకపోతే కడుపు నొప్పి వస్తుంది