ఈ పండ్లు పళ్లకు మేలు చేస్తాయి.. 

13 January 2024

TV9 Telugu

పళ్లను శుభ్రపరచడంలో యాపిల్ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నోటి దుర్వాసనను సైతం దూరం చేస్తాయి. ఇందులోని ఫైబర్‌ దంతాలను శుభ్రపరుస్తుంది. 

కివీ పండును నిత్యం తీసుకుంటే పళ్ల ఆరోగ్యం మెరుగువుతుంది. ఇందులోని క్యాల్షియం దంతాలను పాడు చేసే యాసిడ్స్‌ను తగ్గిస్తాయి

పళ్లు, చిగుళ్లు ఆరోగ్యాన్ని కాపాడడంలో స్ట్రాబెర్రీ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్‌ సి చిగుళ్లను ధృడంగా మార్చుతాయి. 

పాలలోని క్యాల్షియం దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. నోటి దుర్వాసనను సైతం తగ్గించడంలో క్యాల్షియం ఉపయోగపడుతుంది. 

క్యారెట్‌ను నిత్యం తీసుకోవడం వల్ల నోట్లో బ్యాక్టీరియా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో దంత సమస్యలు దరిచేరవని సూచిస్తున్నారు. 

విటమిన్‌ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ వంటి వాటిని తీసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి వీటిని క్రమంతప్పకుండా తీసుకోవాలి. 

అరటిలోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరటి తొక్క లోపలి భాగాన్ని రుద్దితో పళ్లు తెల్లగా మారుతాయి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం