28 August 2024
TV9 Telugu
Pic credit - Pexels
నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బి6, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నిమ్మరసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది.
నిమ్మ కాయలో సువాసన , పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నిమ్మకాయను సలాడ్‌లు, ఆహార పదార్ధాలు, పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే కొన్ని వస్తువులతో కలిపి తినకూడదు.
పాలు నిమ్మరసంతో కలిసిన వెంటనే పాలు విరిగిపోతాయి. కనుక పాలు తాగిన వెంటనే నిమ్మరసం తీసుకోవడం సరైనది కాదు. ఇది అసిడిటీ, అజీర్ణ సమస్యకు కారణం కావచ్చు
పెరుగు లేదా ఏదైనా ఇతర పాల ఉత్పత్తులతో నిమ్మరసం తీసుకోవద్దు. ఇలా తినడం వలన జీర్ణక్రియకు హాని కలుగుతుంది.
ఫ్రూట్ సలాడ్‌లో నిమ్మరసం కలుపుతారు. అయితే బొప్పాయితో నిమ్మరసం తీసుకోవడం మంచిది కాదు. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. దీంతో ఛాతీలో, కడుపులో మంట సమస్యతో ఇబ్బంది పడతారు.
పచ్చి టమోటాలను సలాడ్‌గా తీసుకుంటుంటే దానితో పాటు నిమ్మకాయను తీసుకోవద్దు. ఈ రెండు పదార్థాల కలయిక వల్ల ఎసిడిటీ వస్తుంది
ఉడికించిన గుడ్ల రుచిని మెరుగుపరచడానికి నిమ్మరసం కలిపి తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే ఈ కలయిక జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.