నిమ్మరసం వల్ల బోలెడు ఉపయోగాలు. ఆరోగ్యాన్నిచ్చే విటమిన్-సి, మరెన్నో పోషకాలుంటాయి దీంట్లో. అయితే ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచడంలో బలేగా పనిచేస్తుంది
TV9 Telugu
నిమ్మకాయలు సీజనల్ రోగాలు ధరిచేరకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ నిమ్మరసం తాగడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చు
TV9 Telugu
నిమ్మరసం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మలో కావాల్సినంత సి విటమిన్ లభిస్తుంది. తరచూ నిమ్మరసం తీసుకునే వారిలో వయసు పెరుగుతున్నా చర్మం అంత త్వరగా ముడుతలు పడదు
TV9 Telugu
చాలా మంది ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వస్తుంది
TV9 Telugu
ఇన్ని ప్రయోజనాలు ఉన్ననప్పటికీ కొన్ని పదార్ధాలతో నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీసి, అనేక ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలుకుతుంది
TV9 Telugu
కాబట్టి ఈ పదార్థాలను తీసుకున్న తర్వాత లేదా కొంత సమయం వరకు నిమ్మకాయలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుడ్లతో నిమ్మరసం తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి, అజీర్ణం ఏర్పడుతుంది
TV9 Telugu
పెరుగుతో పాటు నిమ్మకాయను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. పాలలో నిమ్మరసం తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి
TV9 Telugu
నిమ్మకాయతో టమోటా తినవద్దు. ఎందుకంటే ఇది కడుపులో ఎసిడిటీని కలిగిస్తుంది. వీలైతే సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఈ విధమైన ఆహారాతో కలిపి తీసుకోకపోవడమే మంచిది