మైగ్రేన్‌తో బాధపడే వారు.. మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 35% మంది రోగులు మద్యం సేవించిన తర్వాత మైగ్రేన్ తలనొప్పికి గురవుతున్నరని గణంకాలు చెబుతున్నారు.
ఇక మైగ్రేన్‌ను ప్రేరేపించే ఆహార పదార్థాల్లో చాక్లెట్ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. చాక్లెట్‌లో ఉండే కెఫిన్, బీటా ఫెనిలేథైలమైన్ అనే రసాయనం మైగ్రేన్ నొప్పిని పెంచుతుంది.
అప్పటికే మైగ్రేన్‌తో బాధపడే వారిలో టీ, కాఫీలు తాగితే మైగ్రేన్ తలనొప్పి ఎక్కువవుతుంది. అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మీ తలనొప్పి పెరుగుతుంది.
ప్రాసెస్‌డ్ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య ఎక్కువవుతోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది.
చీజ్‌లో ఉండే టైరమైన్ అనే పదార్ధం మైగ్రేన్‌తో పాటు, ఇతర రకాల తలనొప్పికి కారణమవుతుంది. టైరమైన్ సాధారణంగా ఫెటా, బ్లూ చీజ్ .. పర్మేసన్‌లలో కనిపిస్తుంది.
ఉప్పు ఎక్కువ తీసుకున్నా మైగ్రేన్ వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది. ఇది తలనొప్పి .. మైగ్రేన్లకు దారితీస్తుంది.
ఎక్కువగా కూల్‌గా ఉండే వస్తువులైన ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ తీసుకున్నా.. వెంటనే మైగ్రేన్ నొప్పి పెరుగుతుందని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.