రెడ్ మీట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. ఇందులో ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నా కడుపు ఆరోగ్య పనితీరుకు అడ్డుగా మారుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారం కడుపు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇవి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్, స్నాక్స్ దూరంగా ఉండాలి.
చక్కెర ఎక్కువగా ఉండే క్యాండీలు, పేస్ట్రీలు, సోడాలు వంటివి తీసుకోవడం వల్ల అజీర్తి వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని తెలిసిందే. అయితే ఇతర అనారోగ్య సమస్యలతో పాటు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కడుపులో మంట వంటి సమస్యలకు దారి తీస్తుంది.
కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. యాసిడ్ రీఫ్లెక్స్, గుండె మంటకు దారితీస్తుంది.
స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది కడుపులో చికాకు కలిగిస్తుంది. కడుపుబ్బరం, నొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే కంటెంట్‌ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజూ సరిపడ నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.