ఇవి తింటున్నారా.? పేగుల ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్లే 

Narender Vaitla

10 October 2024

ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యకరమైన కొవ్వులు వల్ల జీర్ణ రుగ్మతలు , మంటను కలిగిస్తాయి. 

స్వీట్లు, సోడా డ్రింక్స్‌, బేకరీ ఐటమ్స్‌ వంటివి కూడా పేగు ఆరోగ్యంపై ప్రమాదం పడుతుంది. ముఖ్యంగా మైదా ఉండే ఫుడ్‌ తీసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు.

నూనెలో వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. తినడానికి రుచిగా ఉన్నా.. ఇవి పేగుల్లో మంటకు దారి తీస్తాయి. జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి.

రెడ్‌ మీట్‌ ఎక్కువగా తీసుకుంటే కూడా పేగు ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు ఎక్కువగా ఉపయోగిస్తే కూడా జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి పేగు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల కూడా పేగు ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది.

కెఫిన్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కూడా పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కెఫీన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు సమస్యలు వస్తాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.